Em D C Em G
దేవ సంస్తుతి చేయవే మనసా – శ్రీ -మంతుడగు
D
యెహోవా సంస్తుతి
C Em G D
చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా
C Em C D Em
యెహోవా దేవుని – పావన నామము నుతించుమా –
G D C Em
నా యంతరంగము- లో వసించు నో సమస్తమా
1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు = నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు – లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే
2. చావు గొతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను = జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే
3. యౌవనంబు పక్షిరాజు – యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై వెలయునట్లుగ – మే లిచ్చి నీదు – భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే
4. ప్రభువు నీతి పనులు చేయున్ – బాధితులకు న్యాయ మిచ్చున్ – విభుడు మార్గము తెలిపె, మోషేకు – దన కార్యములను – విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే
5. అత్యధిక ప్రేమ స్వరూపి – యైన దీర్ఘ శాంతపరుడు – నిత్యమూ వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు – నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే
6. పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు = భూమి కన్న నాకసంబున్న – యెత్తుండు దైవ – ప్రేమ భక్తి జనుల యందున – ఆ కారణముచే
7. పడమటికి దూర్పెంత యెడమో – పాపములకును మనకు నంత = యెడము కలుగ జేసియున్నాడు – మన పాపములను – ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే
8. కొడుకులపై దండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల = యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల – యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే
9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి = మనము మంటివార మంచును – జ్ఞాపకముచేసి – కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే
10. వూసి గాలి వీవ నెరిగి – పోయి బసను దెలియని వన – వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ – ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే
11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు = నిరతమును గృప నిలిచి యుండును – యెహోవా నీతి – తరముల పిల్లలకు నుండును – ఆ కారణముచే
No comments:
Post a Comment